అసత్య ప్రసారాలు చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-05-24T09:36:04+05:30 IST
జీ మామిడాడలో కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి ప్రథమ కాంటాక్టు వ్యక్తులు, స్థానికులకు శుక్రవారం శ్వాబ్ పరీక్షలు ని..

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ
పెదపూడి, మే 23 : జీ మామిడాడలో కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి ప్రథమ కాంటాక్టు వ్యక్తులు, స్థానికులకు శుక్రవారం శ్వాబ్ పరీక్షలు నిర్వ హించి వీరిని కాకినాడ క్వారంటైన్‌కు తరలించారు. శనివారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గ్రామానికి వచ్చి కంటైన్మెంట్ జోన్‌లో పరిస్థితులను పరిశీలించారు. డీఎస్పీ వీ.భీమారావు అక్కడి పరిస్థితులను ఎస్పీకి వివరిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు వదంతులను నమ్మ వద్దన్నారు. ప్రజలు వీధులలోకి రాకుండా స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిం చాలన్నారు. ఆయన వెంట కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, పెద పూడి ఎస్‌ఐ లక్ష్మి ఉన్నారు. ఇక జీ మామిడాడ కేంద్రంగా శనివారం 19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ తెలిపారు.