ఆగిన రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2020-03-25T10:46:03+05:30 IST

కరోనా దెబ్బకు జిల్లాలో రిజిస్ర్టేషన్లు దారుణంగా పడిపోయాయి. రోజూ వందల సంఖ్యలో జరిగే రిజిస్ర్టేషన్లు పదుల

ఆగిన  రిజిస్ర్టేషన్లు

లావాదేవీలను కాటేసిన కరోనా 

ప్రభుత్వాదాయానికి భారీగా గండి


ఏలూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు జిల్లాలో రిజిస్ర్టేషన్లు దారుణంగా పడిపోయాయి. రోజూ వందల సంఖ్యలో జరిగే రిజిస్ర్టేషన్లు పదుల సంఖ్యను కూడా చేరడం లేదు. ఏలూరు, భీమవరర  రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల పరిధిలోని 27 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతీ నెలా 15 వేలకు పైగా రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. పదిహేను రోజులుగా కరోనా దెబ్బకు రిజిస్ర్టేషన్లు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో జనతా కర్ఫ్యూ మొదలైన నాటి నుంచి రిజిస్ర్టేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. కక్షిదారులందరూ లావాదేవీలను వాయిదా వేసుకున్నారు.


దస్తావేజు లేఖరులు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే కార్యాలయాలు కక్షిదారులు లేక వెలవెలబోతున్నాయి. జనతా కర్ఫ్యూ మొదల య్యాక రిజిస్ర్టేషన్లు పూర్తిగా ఆగిపోయాయని రిజిస్ట్రార్‌ ఎల్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. సగటున ఒకటి, రెండు అవ్వడమే కష్టంగా ఉందన్నారు. 

Read more