ఏలూరు పోలీసులకు రాష్ట్ర స్థాయి అవార్డు
ABN , First Publish Date - 2020-08-12T10:57:49+05:30 IST
నేర పరిశోధనలో రాష్ట్ర స్థాయిలోనే ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ ప్రథమస్థానంలో నిలిచింది.

ఏలూరు క్రైం, ఆగస్టు 11 : నేర పరిశోధనలో రాష్ట్ర స్థాయిలోనే ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ ప్రథమస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రతిష్టాత్మక ఎ,బీీ,స,డీ మొదటి కేటగిరి అవార్డుకు ఏలూరు సబ్ డివిజన్ పోలీసులు ఎంపికయ్యారు. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో 2019 అక్టోబర్ 16న నమోదైన కేసుకు సంబంధించి ఈ అవార్డు వచ్చింది. ఏలూరులో ఒక ఉపాధ్యాయుడి మృతిని అనుమానాస్పదంగా నమోదు చేసి పోలీసులు తమ దైన శైలిలో దర్యాప్తు చేశారు.
ఈ కేసులో హంతకుడు సింహాద్రిని అరెస్ట్ చేశారు. అతన్ని పూర్తిస్థాయిలో విచారిస్తే అమాయలకు రంగు రాళ్లు ఇస్తానని వలవేసి సెనైడ్తో అప్పటికే 9 హత్యలు చేసినట్లు వెల్లడై ంది.ఈ కేసు దర్యాప్తు, విచారణ రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొం దింది. దీంతో ఎ, బీ, సీ, డీ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్,ఇతర అధికారులు అమరావతిలోని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ చేతుల మీదుగా అందుకోనున్నారు.