-
-
Home » Andhra Pradesh » West Godavari » srivaru
-
నేడు రశ్రీవారి తెప్పోత్సవం
ABN , First Publish Date - 2020-11-26T05:07:21+05:30 IST
క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది.

ద్వారకా తిరుమల, నవంబరు 25 : క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకు నరసింహసాగర్‌ను విద్యుత్ దీపా లంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్లు విహరించే హంస వాహనాన్ని విద్యుత్ దీపాలంకరణలు, వివిధ రకాల పుష్ప జాతులతో ప్రత్యేకంగా అలంకరిం చారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ స్వామివారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేసినట్టు దేవస్థాన కార్య నిర్వహణాఽధికారి డి.భ్రమరాంబ తెలిపారు.