నేడు పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2020-11-22T04:18:52+05:30 IST

పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజరు శివాజి తెలిపారు.

నేడు పంచారామాలకు ప్రత్యేక బస్సులు

ఆచంట / నరసాపురం, నవంబరు 21: పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజరు శివాజి తెలిపారు. ఆదివారం డిపో నుంచి మూడు బస్సులు బయలుదేరుతాయన్నారు. రాత్రి 8గంటల నుంచి ఈసర్వీసులు బయలుదేరుతాయన్నారు. పాలకొల్లు, భీమవరం, గుడివాడ మీదుగా ముందు అమరావతి చేరుకుంటాయన్నారు. అక్కడి నుంచి సామర్లకోట, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు క్షేత్రాలను దర్శించుకుని రాత్రి 8గంటలకు నరసాపు రం చేరుకుంటాయన్నారు. ఈ నెల 22, 29, వచ్చే నెల 6, 13 తేదీలలో కూడా ప్రత్యేక సర్వీసులు నడుస్తాయన్నారు. ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవాలన్నారు.  మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబరు 73828 25486, ఆచంట ఆర్టీసీ ఏజెంట్‌ ఫోన్‌ నంబరు  98855 52777లో సంప్రదించాలని కోరారు.

Read more