ప్రజలు ఎవ్వరూ బయటికి రావొద్దు : ఎస్పీ

ABN , First Publish Date - 2020-04-05T10:59:22+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ వ్యాధిని నిర్మూలించడానికి విధించిన లాక్‌డౌన్‌ నేప థ్యంలో ప్రజలు ఎవ్వరూ బయటికి రావద్దని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ హెచ్చరించారు.

ప్రజలు ఎవ్వరూ బయటికి రావొద్దు : ఎస్పీ

ఏలూరు క్రైం/ భీమడోలు, ఏప్రిల్‌ 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ వ్యాధిని నిర్మూలించడానికి విధించిన లాక్‌డౌన్‌ నేప థ్యంలో ప్రజలు ఎవ్వరూ బయటికి రావద్దని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో  ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ శనివారం ఏలూరు నగరంలో ఉన్న హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోనూ, భీమడోలు మండలం గుండుగొలను గ్రామాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. గుండుగొలను ప్రాంతంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా రావడంతో హాట్‌స్పాట్‌గా నిర్ణ యించామని ఆ ప్రాంతంలోని వారు బయటికి రాకూడదని బయటి వారు ఆ ప్రాంతానికి వెళ్లకుండా మూసి వేశామన్నారు. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతాన్ని కూడా హాట్‌స్పాట్‌గా నిర్ణయించామన్నారు. కోకోలా కంపెనీ వారు తీసుకువచ్చిన వాటర్‌ బాటిల్స్‌ను ఎస్పీ చేతుల మీదుగా పికెట్‌లో ఉన్న పోలీస్‌ సిబ్బందికి అందజేశారు.  

Updated Date - 2020-04-05T10:59:22+05:30 IST