-
-
Home » Andhra Pradesh » West Godavari » sp narayana nayak west godavari visting NDD
-
జూదక్రీడలు నిర్వహించకుండా చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2020-12-11T05:07:51+05:30 IST
రాబో యే పండుగ రోజుల్లో జూదక్రీడలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.నారాయ ణ నాయక్ పోలీసులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ నారాయణనాయక్
నిడదవోలు, డిసెంబరు 10 : రాబో యే పండుగ రోజుల్లో జూదక్రీడలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.నారాయ ణ నాయక్ పోలీసులను ఆదేశించారు. నిడదవోలు పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయం, పట్టణ పోలీస్ స్టేషన్, సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ లను గురువారం ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా అధికార్లతో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రక్షక దళాలను కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసి దేవాలయాల పరిరక్షణ కు చర్యలు తీసుకోవాలన్నారు. నమోదవుతున్న కేసులు, సాగుతున్న దర్యాప్తు రికార్డులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ బి.త్రినాథ్, నిడదవోలు సీఐ కె.ఎ.స్వామి, ఎస్‌ఐలు ఉన్నారు.