చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-07T05:58:07+05:30 IST

హోంగార్డ్సుకు అప్ప గించిన బాధ్యతలను నీతి నిజాయితీ, చిత్త శుద్ధితో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ అన్నారు.

చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలి : ఎస్పీ
సభలో మాట్లాడుతున్న ఎస్పీ నారాయణ నాయక్‌

ఏలూరు క్రైం, డిసెంబరు 6 : హోంగార్డ్సుకు అప్ప గించిన బాధ్యతలను నీతి నిజాయితీ, చిత్త శుద్ధితో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ అన్నారు. 58వ హోం గార్డ్సు ఆవిర్భావ దినోత్సవాన్ని సురేష్‌చంద్ర బహుగుణ ఇంగ్లీషు మీడియం స్కూలులో  నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ప్రజాసేవే కర్తవ్యమన్న విషయాన్ని అన్ని వేళలా గుర్తుంచుకోవాల న్నారు. తమ్మిలేరులో పడిపోయిన ఒక వ్యక్తిని కాపా డిన హోంగార్డు రవికుమార్‌ ధైర్య సాహసాలను ఎస్పీ నారాయణ నాయక్‌,  అదనపు ఎస్పీ ఏవీ సుబ్బ రాజు అభినందించి సత్కరించారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎ.మహేష్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T05:58:07+05:30 IST