స్నేహితుడితో కలిసి పొలంలో ఉన్న తల్లిని కత్తితో నరికి చంపిన కొడుకు..
ABN , First Publish Date - 2020-08-01T21:29:28+05:30 IST
బాకీ తీర్చమని అడిగిన తల్లినే కత్తితో నరికి చంపిన కుమా రుడు, అతనికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరె స్టు చేశారు. టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌లో జంగారెడ్డి గూడెం సీఐ బీఎన్ నాయక్

తల్లిని చంపిన తనయుడి అరెస్టు
టి.నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : బాకీ తీర్చమని అడిగిన తల్లినే కత్తితో నరికి చంపిన కుమా రుడు, అతనికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరె స్టు చేశారు. టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌లో జంగారెడ్డి గూడెం సీఐ బీఎన్ నాయక్ శుక్రవారం విలేకర్ల సమా వేశంలో వివరాలు తెలిపారు. శ్రీరామవరంలో పేరుబోయిన సరోజినికి గల ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కుమార్తె, ఇద్దరు కుమారులకు ఒక్కొక్కరికీ ఎకరం న్నర చొప్పున పంచి మిగిలిన అరెకరం భూమిని ఆమె సాగు చేసుకుంటోంది. నలుగురు సమానంగా సొమ్ము చెల్లించే ఒప్పందంతో ఐదెకరాల పొలంలో గతంలో బోరు తవ్వించారు. అనంతరం పెద్ద కుమారుడైన శ్రీను తన పొలాన్ని కౌలుకు ఇచ్చాడు.
అయితే బోరుకు అయిన ఖర్చులో అతని వాటా సొమ్ము ఇవ్వకపోవడంతో కౌలు రైతు నిమ్మకాయలు కోస్తుండగా తల్లి అడ్డుపడింది. దీంతో కౌలు రైతు శ్రీనును నిలదీశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని లేనిపక్షంలో చీటింగ్ కేసు పెడతానని హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన శ్రీను... తన స్నేహితుడైన కొలగాని మంగరాజుతో కలిసి జూలై 27న పొలంలో తల్లిని మెడపై కత్తితో నరికి చంపాడు. అనంతరం పరారైన నిందితులిద్దరిని శుక్రవారం అరెస్టు చేసి చింతలపూడి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ కె.రామకృష్ణ, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు, హెచ్‌సీ పి.మహేశ్వ రరావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.