రెండు తలల పాము హతం

ABN , First Publish Date - 2020-11-20T04:52:06+05:30 IST

అరుదుగా కన్పించే రెండు తలల పాము జాతీయ రహదారిపై మృతి చెందింది.

రెండు తలల పాము హతం
మృతి చెందిన రెండు తలల పాము

 జీలుగుమిల్లి, నవంబరు 19 : అరుదుగా కన్పించే రెండు తలల పాము జాతీయ రహదారిపై మృతి చెందింది. దర్భగూడెం సమీప పొలాల్లోంచి జాతీయ రహదారిపైకి రెండు తలల పాము వచ్చింది. రోడ్డుపై వెళుతున్న వాహనం తొక్కడంతో అది మృతి చెందింది. అయితే రోడ్డుపై కన్పిస్తున్న రెండు తలలపామును పలువురు ఆసక్తిగా తిలకించారు.


Updated Date - 2020-11-20T04:52:06+05:30 IST