కరోనాతో ఆరుగురు మృతి.. గాయాలకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే..

ABN , First Publish Date - 2020-08-08T19:18:31+05:30 IST

కరోనా ప్రాణాలను హరించేస్తోంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఏడుగురు మృతిచెందారు. ఇరగవరం మండలం పేకేరులో విద్యుత్‌ లైన్‌మన్‌(40)గా పని చేస్తున్నారు. గతంలో జ్వరం

కరోనాతో ఆరుగురు మృతి.. గాయాలకు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే..

తణుకురూరల్‌/ఇరగవరం/నల్లజర్ల/నరసాపురం : కరోనా ప్రాణాలను హరించేస్తోంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఏడుగురు మృతిచెందారు. ఇరగవరం మండలం పేకేరులో విద్యుత్‌ లైన్‌మన్‌(40)గా పని చేస్తున్నారు. గతంలో జ్వరం రావడంతో రెండు సార్లు కొవిడ్‌ పరీక్షలు చేయిం చినా నెగిటివ్‌ వచ్చింది. గురువారం మరోసారి పరీక్షలు చేయించగా పాజి టివ్‌ రావడంతో ఆందోళనతో ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. తణుకు మండలం పైడిపర్రులో వృద్ధురాలు (60) దగ్గు, జ్వరం ఎక్కువై చనిపోయారు. తేతలి సొసైటీలో ప్రముఖ పదవిలో ఉన్న వ్యక్తి(54) కరోనాతో చని పోయారు. 20 రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


దువ్వలో చనిపోయిన ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ చేసే వ్యక్తి వ్యక్తి(54) గురువారం పరీక్ష చేయించగా పాజిటివ్‌ రావడంతో వైద్యులు ఇంట్లోనే ఉండమని సూచ నలు చేశారు. అంబులెన్స్‌ ఇంటికి వచ్చి తీసుకెళ్తున్న సమయంలో ఆందోళనతో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలినట్టు వైద్య సిబ్బంది చెబుతు న్నారు.నల్లజర్ల మండలం అనంతపల్లిలో కరోనా సోకిన మహిళ(65) మృతి చెందినట్టు సీహెచ్‌వో తెలిపారు. నరసాపురం పట్టణ పరిధి 31వ వార్డుకు చెందిన వృద్ధురాలు(75) కరోనాతో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు రుస్తుంబాద ఆసుపత్రికి తరలించగాకొద్దిసేపటికే మృతిచెందింది.  

Updated Date - 2020-08-08T19:18:31+05:30 IST