30 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్‌లు

ABN , First Publish Date - 2020-03-15T11:30:46+05:30 IST

ఎన్నికల విధులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ముత్యాలరాజు శనివారం

30 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్‌లు

ఏలూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల విధులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ముత్యాలరాజు శనివారం షోకాజ్‌ నోటీ సులు జారీ చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని ఆయన సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలుకు సంబంధించి స్టేజి- 1 రిటర్నింగ్‌ అధికారులను గోదావరి సమావేశ మందిరంలో మార్చి- 13న అదనపు జిల్లా ఎన్నికల అధికారి, డీపీవో శ్రీని వాస విశ్వనాథ్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతు లకు 30 మంది సిబ్బంది గైర్హాజరయ్యారు.


రాష్ట్రస్థాయి ఎన్ని కల పరిశీలకులైన హిమాంశు శుక్లా హాజరైన ఈ కార్య క్రమానికి శిక్షణ నిమిత్తం 423 మందిని ఎంపిక చేయగా వారిలో 30 మంది గైర్హాజరయ్యారు. దీనిని సీరియస్‌గా పరి గణించిన ఆయన వీరికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. శిక్ష ణకు గైర్హాజరవడం నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుం దని డీపీవో ఈ సందర్భంగా సిబ్బందిని హెచ్చరించారు. 

Updated Date - 2020-03-15T11:30:46+05:30 IST