-
-
Home » Andhra Pradesh » West Godavari » shashti vedukalu west godavari dist
-
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం
ABN , First Publish Date - 2020-12-20T05:29:24+05:30 IST
జిల్లా వ్యాప్తంగా షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో శనివారం రాత్రి స్వామివారికి కల్యాణం నిర్వహించారు.

అత్తిలి, డిసెంబరు 19 : జిల్లా వ్యాప్తంగా షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో శనివారం రాత్రి స్వామివారికి కల్యాణం నిర్వహించారు. అత్తిలి సుుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యా ణం వైభవంగా జరిగింది. మేళతాలాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అయిలూరి శ్రీరామ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కల్యాణ వేడుక నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సమర్పించిన తలంబ్రాల బియ్యంతో ప్రసాదం చేసుకుని తింటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.