జీతం రాక.. ఆకలి తీరక రోడ్డెక్కిన టీచర్లు

ABN , First Publish Date - 2020-09-06T09:29:55+05:30 IST

ఉపాధ్యాయుల పండుగ రోజునే.. మా ఆకలి తీర్చండి.. ఉపాధి కల్పించండి అంటూ పలువురు ఉపాధ్యాయుల రోడ్డెక్కారు.

జీతం రాక.. ఆకలి తీరక రోడ్డెక్కిన టీచర్లు

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 5 : ఉపాధ్యాయుల పండుగ రోజునే.. మా ఆకలి తీర్చండి.. ఉపాధి కల్పించండి అంటూ పలువురు ఉపాధ్యాయుల రోడ్డెక్కారు. ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో   ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేద్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడి ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వం జీతాలు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీతాలు ఇప్పించాలని, తొలగించిన ఉద్యోగాల్లో తిరిగి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల కృష్ణారావు, జయప్రకాష్‌, పలువురు ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు. 


రేపటిలోగా ఫిర్యాదు చేయండి 

జీతాలందని, ఉద్యోగం పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ సూచన 

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబర్‌ 5 : ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించని పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లాలో జీతాలు అం దని, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే తమ ఫిర్యాదులను ఏలూరు డీఈవో కార్యాలయంలో లికిత పూర్వకంగా కాని లేదా డీఈవో ఛ్ఛీౌఠీజఃడ్చజిౌౌ.ఛిౌ.జీుఽ కుగాని లేదా స్వయంగా వచ్చి ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. జీతాలు చెల్లించని ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి  సంబంధిత యాజమాన్యాలు కొన్నినెలలుగా జీతాలు ఇవ్వడం లేదని విద్యా శాఖకు ఫిర్యాదులు అందాయని  తెలిపారు. మరికొందరు ఉపాధ్యాయులను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా తెలిసిందన్నారు.  

Updated Date - 2020-09-06T09:29:55+05:30 IST