రండి.. చూడండి

ABN , First Publish Date - 2020-11-16T05:28:18+05:30 IST

పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను తర గతులకు రప్పించేందుకు అందుబాటులో వున్న అన్ని ప్రయత్నాలను

రండి.. చూడండి

పిల్లలను బడికి పంపించండి.. అంటూ 

విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 15 : పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను తర గతులకు రప్పించేందుకు అందుబాటులో వున్న అన్ని ప్రయత్నాలను విద్యాశాఖ చేస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10, సీనియర్‌ ఇంటర్‌ తరగతులను ప్రారంభిం చిన విద్యా శాఖ మరోవారం వ్యవధిలో 6, 7, 8 తరగతు లను ఈ నెల 23 నుంచి నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. తొలి దశలో ప్రారంభించిన 9, 10 తరగతు లకు బాలబాలికల హాజరు స్వల్పంగా ఉంది. పట్టణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 10 నుంచి 14 శాతంలోపు మాత్రమే ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతంగా ఉంది. కరోనా పట్ల విద్యార్థులు తల్లి దండ్రుల్లో ఆందోళన కొనసాగుతుండడమే దీనికి కారణ మని తేలింది. 9, 10 తరగతులకు హాజరుకాని విద్యా ర్థుల గురించి సర్వే నిర్వహించాలని విద్యాశాఖ అధికా రులు ఆదేశించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశా లల్లో పనిచేస్తున్న టీచర్లతోపాటు పీఆర్‌పీల సేవలను ఈ సర్వేకు వినియోగించుకోవాలని సూచించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల వివరాలను ఈ నెల 17లోగా సర్వే ద్వారా సేకరించాలని నిర్ధేశించారు. తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయాలని కాకినాడ ఆర్‌జేడీ ఆర్‌.నరసింహారావు జిల్లా విద్యాశాఖకు నిర్ధేశం చేశారు. తరగతులకు హాజరు కాకపోవడం వల్ల చదువులో వెనుకబడిపోతారని, అలాగే కొవిడ్‌–19 నిరోధానికి తీసుకున్న చర్యలన్నింటిని తెలిసే లా లేఖలో పొందుపర్చారు. ఆ మేరకు తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించాలని పిల్లలను నిరభ్యంతరంగా తరగతులకు పంపించాలని లేఖలో అభ్యర్థించారు. దీని పై స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 


విద్యార్థులకు, టీచర్లకు పాజిటివ్‌ 

అక్టోబరు 15 నుంచి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా టెస్ట్‌లు చేపట్టారు. ఆ ప్రకారం ఈ నెల 13వ తేదీ వరకూ వెల్లడైన ఫలితాల్లో మొత్తం 307 మంది విద్యార్థులకు, 192 మంది టీచర్లకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరందరినీ హోం ఐసొలే షన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-16T05:28:18+05:30 IST