ఏం చేద్దాం..!

ABN , First Publish Date - 2020-11-07T06:05:38+05:30 IST

విద్యార్థుల తల్లి దండ్రులో కరోనా భయం వెంటాడుతూనే ఉంది.

ఏం చేద్దాం..!

 బడులకు పిల్లలను పంపడంపై తల్లిదండ్రుల అంతర్మథనం 

రెండో దశ కరోనా ప్రచారంపై భయాందోళన

పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం : ఎంఈవో 

ఏలూరు రూరల్‌, నవంబరు 6 : విద్యార్థుల తల్లి దండ్రులో  కరోనా భయం వెంటాడుతూనే ఉంది.  కొవిడ్‌ కారణంగా మార్చి 23న మూతపడిన పాఠశాలలు ఏడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పలువురు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ పరిస్థితుల్లో పిల్లల్ని బడికి పంపాలా.. వద్దా అనేది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న ఇది.  చలికాలం మొదలు కావడంతో కరోనా వ్యాప్తి అధికం అవుతుందని రెండో దశ వైరస్‌ వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయన్న ప్రచారంతో రిస్కు తీసుకుని పాఠ శాలలకు పంపడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో కొవిడ్‌ నిబంధనలు సరిగ్గా పాటిస్తారో లేదోనని భయపడుతున్నారు. శానిటైజ్‌ చేయడం పైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు అయితే డిసెంబరులో అర్ధ సంవత్సరం పరీక్షలు ఉంటాయి, ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా ఉంది, పిల్లల్ని పంపక పోతే చదువు పరంగా ఇబ్బంది అవుతుందంటూ తల్లి దండ్రులకు చెప్పి ఒప్పించే పనుల్లో ఉండడం గమనార్హం. 

 22 మంది విద్యార్థులకు.. ఆరుగురు టీచర్లకు కొవిడ్‌

 తాజాగా అక్టోబరు 2వ తేదీ నుంచి నవంబరు 5వ తేదీ వరకు మండలంలోని ఎనిమిది జిల్లా పరిషత్‌  ఉన్నత పాఠశాల్లో  2,459 మంది విద్యార్థులకు కొవిడ్‌ టెస్టులు నిర్వహిం చగా 22 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలిం ది. 246 మంది ఉపాధ్యాయులకు టెస్టులు నిర్వహించగా  ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ఇంకా విద్యార్థులకు, ఉపా ధ్యాయులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కిట్లు కొరత కారణంగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాలేదు. కిట్ల పంపిణీలో వైద్య ఆరోగ్య శాఖ  చేతులెత్తేసింది. కాగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌ కేసులు నమోదైన పాఠశాలల్లో బోధన ఆపేయాలంటూ వినతులు వెల్లువెత్తు తున్నాయి. టీచర్లతో పాటు విద్యార్థులకు భోజన పథకం సిబ్బందికి పరీక్షలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


హాజరు అంతంతమాత్రమే..

ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శుక్రవారం ఐదవ రోజు అంతంత మాత్రంగానే హాజరు నమోదైంది. మండలంలోని ఎనిమిది ఉన్నత పాఠశాలలకు సంబంధించి  9,10 తగరతులకు చెందిన విద్యార్థులు 382 మంది హాజర య్యారు. హాజరు పెరిగేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. రోజు విడిచి రోజు తరగతులు నిర్వ హిస్తున్నారు. మొదటి నాలుగు రోజులతో పోలిస్తే ఐదో రోజు ఉపాధ్యాయులు ఎక్కువ మంది హాజరయ్యారు.  ఈ విద్యా సంవత్సరాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే కొనసాగిస్తే బాగు ంటుందని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. 


భయపడొద్దు.. అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాం

ఎంఈవో  నరసింహమూర్తి 

కరోనా సోకుతుందన్న భయం అక్కరలేదు. పాఠశాలలను ఉదయం, సా యంత్రం శానిటైజేషన్‌ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే సగానికిపైగా విద్యా ర్థులకు, ఉపాధ్యాయులకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించాం.  విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకీ పెరుగుతోంది. పాఠశాలలు పూర్తి స్థాయిలో థర్మల్‌ గన్స్‌, శాని టైజర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రైవేటు పాఠ శాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు టీసీతో పని లేదు. టీసీ లేని విద్యార్థులను తల్లి దండ్రుల అంగీకార పత్రంతో నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.  

Updated Date - 2020-11-07T06:05:38+05:30 IST