విద్యార్థుల హాజరు మరింత తగ్గింది
ABN , First Publish Date - 2020-11-04T04:51:56+05:30 IST
పాఠశాలలు తెరిచిన రెండో రోజు మంగళవారం విద్యార్థుల హాజరు మరింత తగ్గింది.
పాలకొల్లు రూరల్, నవంబరు 3 : పాఠశాలలు తెరిచిన రెండో రోజు మంగళవారం విద్యార్థుల హాజరు మరింత తగ్గింది. మండలంలోని 7 జడ్పీ హైస్కూల్స్, 1 ఎయిడెడ్ హైస్కూల్‌లో మంగళవారం సుమారు 20శాతం మంది హాజరైనట్టు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రాలను తీసుకురావాలని ఉపాధ్యాయులు సూచిం చారు. తల్లిదండ్రుల అనుమతి పత్రాలు లేకుంటే తరగతులకు అనుమతించ లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలను పాఠశాలలకు పంపుతామని, విద్యా సంవత్సరం నష్టపోయినా ఫరవాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
హైస్కూల్ విదార్థికి పాజిటివ్
నరసాపురం, నవంబర్ 3: వేములదీవి పంచాయితీ పరిధిలోని కాపుల గడప హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంగళవారం కరోనా నిరా ్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఒక విద్యార్థికి పాజిటవ్ వచ్చినట్లు తూర్పుతాళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి చెప్పారు. 20 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు.