మహా ఆనందం
ABN , First Publish Date - 2020-05-29T11:23:00+05:30 IST
తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ క్లిష్ట సమయంలో మహా నాడు చర్చల్లో పాలుపంచుకున్నాయి.

మహా నాడు తీరుపై క్యాడర్లో సంతృప్తి
జూమ్‌యాప్ కలిసొచ్చిందంటూ వ్యాఖ్యలు
ప్రాజెక్టులు, వ్యవసాయ చర్చలపైన సంతృప్తి
నిమ్మలకే ఈసారి జిల్లా నుంచి పెద్దపీట
జిల్లావ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి
ఏలూరు, మే 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ క్లిష్ట సమయంలో మహా నాడు చర్చల్లో పాలుపంచుకున్నాయి. పార్టీకి మొదటి నుంచి దన్నుగా నిలబడుతున్న వర్గాలు సీనియర్ నేతల సందేశాలు, జరుగుతున్న పరి ణామాలపై చర్చలను యాప్ ద్వారా తెలుసుకో వడానికి ఆసక్తి కనబరిచాయి. జిల్లాలో ముఖ్య నేతలంతా మహానాడు ఆరంభం నుంచి ముగిసే వరకూ యాప్‌లో వీక్షిం చారు. ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా సాంకేతిక పరిజ్ఞానంతో కార్యక్రమం నిర్వహించడం లో పార్టీ పనితీరు బయటపడిందని నేతలు ఆనందం వ్యక్తం చేశారు.
‘పోలవరం’ ప్రస్తావించిన నిమ్మల
జిల్లాకు సంబంధించి చర్చ ప్రవేశ పెట్టడంలో పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుకు అవకాశం దక్కింది. కీలకమైన పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిం చారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని పూర్తిగా తప్పుబడుతూ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక చేతులెత్తేశారంటూ దుయ్యబట్టారు. ఈ ఏడా ది పాలనలో వైఫల్యాలకు ఇదే తార్కాణం అంటూ ప్రభు త్వంపై విరుచుకుపడ్డారు. సాగు, తాగునీటి విషయంలోనే కాకుండా పాలనా వ్యవహారంలోను వైసీపీకి పట్టులేదని నిమ్మల తప్పుబట్టారు. ప్రాజెక్టులు, వ్యవసాయంపై తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రత్యేకంగా ప్రస్తావిం చడంతో జిల్లా ప్రతినిధులు ఒకింత హర్షం వ్యక్తం చేశారు.
దూరదృష్టితో నిర్ణయాలు
తెలుగుదేశం మొదటి నుంచి సాగు నీరు, వ్యవసాయ అంశాలపై దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుం టుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్టీపరంగా క్యాడర్‌కు స్పష్టత వచ్చేలా మహానాడు కొనసాగి దని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆచంట నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించి కార్యకర్తలకు, నేతలకు ఉత్సాహాన్నిచ్చారు. మహానాడు కార్యకర్తలందరికీ పండుగ వంటిదని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగుతుండడమే కార్యకర్తల పట్టుదలకు నిదర్శనమని పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి కార్యకర్తలతో మాట్లాడారు. రెండు రోజులుగా మహానాడు సాగిన తీరు అత్యద్భుతమని ప్రకటించారు.
ఎన్టీఆర్ అందరికీ ఆదర్శం
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్సీ అంగర రామమోహన్ పిలుపునిచ్చారు. మూడు దశాబ్దాలకుపైగా కలిసి మెలిసి పనిచేశామని, కష్ట నష్టాలను పంచుకున్నామని, పనిచేసే కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇచ్చిందని రామ్మోహన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్టీఆర్ మహానాడు నిర్వహించినపుడు రాజకీ యాంశాలకు తోడు మిగతా అంశాలకు ప్రాఽధాన్యం ఇచ్చేవారన్నారు.
ఇప్పుడు మహానాడులో ఎల్జీ పాలిమర్స్ నుంచి పంట దిగుబడుల అమ్మకాలు, కొనుగోళ్ల వరకూ చర్చించడం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని కొని యాడారు. కష్టించి పనిచేసే వారిని పార్టీ వదులుకోలేదు. కొంత మంది పార్టీని వీడినా భయపడలేదు. సామాజిక న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన డానికి మహానాడు తీర్మానాలు, చర్చలే ఉదాహరణ అని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పద్ధతులపై పార్టీ క్యాడర్ పోరాటానికి సిద్ధపడడం ఎప్పటికీ మర్చిపోలేని విషయంగా పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌కు పార్టీ నిర్ణయాలు, తీరుతెన్నులు నేరుగా తెలిశాయని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.