ఓ వైపు సార్వా , మరోవైపు దాళ్వా

ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యం లో మార్చి నెలాఖరుకు కాల్వలు నిలిపివేస్తా రని రైతులు దాళ్వా నారుమళ్లను త్వరతగతిన పూర్తి చేసుకోవాలంటూ అధికారులు నిత్యం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఓ వైపు సార్వా , మరోవైపు దాళ్వా
పెంటపాడులో సార్వా మాసూళ్లు

తీవ్ర ఒత్తిడికి గురవుతున్న రైతులు

ఇంకా పొలంగట్లపైనే 10 శాతం సార్వా ధాన్యం 

దాళ్వా నారుమళ్లు 85 శాతం పూర్తి 

పెంటపాడు, డిసెంబరు, 10 : ఇటీవల   కురిసిన వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యం లో మార్చి నెలాఖరుకు కాల్వలు నిలిపివేస్తా రని రైతులు దాళ్వా నారుమళ్లను త్వరతగతిన పూర్తి చేసుకోవాలంటూ అధికారులు నిత్యం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేప థ్యంలో రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఓవైపు సార్వా మాసూళ్లు చేస్తూనే.. మరోవైపు దాళ్వా నారుమళ్లు వేసే పనుల్లో నిమగ్నమ య్యారు. నివర్‌ తుఫాన్‌ కారణంగా వరికోతలు పూర్తి కాక నిలిచిపోయిన రైతులు మిషన్‌లు చేలో దిగేందుకు సాధ్యం కాకపోవడంతో కూలీల సా యంతో  కోతలు ముగించుకున్నారు. ఎట్టకేలకు కోతలు ముగించిన ధాన్యం ఽప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తుంటే ఆరుదల లేదంటూ వెనక్కి పంపిస్తున్నారని దీంతో తమకు రవాణా ఖర్చులు కూడా అధికమవుతున్నా యని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం సార్వా సాగుకు సంబంధించి సుమారు 10 శాతం ధాన్యం ఇంకా పొలం గట్లపైనే నిలిచిపోయాయి. ధాన్యం ఆరబెట్టుకునే పనుల్లో నిమగ్నం అయ్యారు. మండలంలో 23,230 ఎకరాలలో దాళ్వా సాగు ప్రారంభించగా ప్రస్తుతం 85 శాతం నారుమళ్లు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా మరో రెండు రోజులలో పూర్తి అవుతాయని ఏవో కె. పార్థసారథి తెలిపారు.
Updated Date - 2020-12-10T05:30:00+05:30 IST