ఎటు చూసినా అపారిశుధ్యమే!
ABN , First Publish Date - 2020-12-07T05:46:26+05:30 IST
అంతుచిక్కని వ్యాధిపై నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మూడు రోజులుగా దాదాపు 320 మందికి పైగా ఆసు పత్రి పాలయ్యారు. అనారోగ్యానికి గురైన వారి నుంచి రక్తం, యూరిన్ సేకరించి పరీక్షలు చేశారు.

ఏలూరు ఫైర్‌స్టేషన్, డిసెంబరు 6 : అంతుచిక్కని వ్యాధిపై నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మూడు రోజులుగా దాదాపు 320 మందికి పైగా ఆసు పత్రి పాలయ్యారు. అనారోగ్యానికి గురైన వారి నుంచి రక్తం, యూరిన్ సేకరించి పరీక్షలు చేశారు. అన్ని రిపో ర్టులు బాగానే ఉన్నాయి. కొవిడ్ పరీక్షల్లో కూడా నెగె టివ్ రిపోర్టులు వచ్చాయి. అయితే నగరంలో నెలకొన్న అపారిశుధ్యం వల్లే ప్రజలు అనారోగ్యాలకు గురవుతు న్నారని అనుమానిస్తున్నారు. నగరమంతా తీవ్ర దుర్గంధంతో నిండిపోయిందని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారై దోమలు విజృంభిస్తున్నాయని ఆరోపిస్తు న్నారు. పత్తేబాదలోని డ్రెయిన్లలో మురుగునీరు రోడ్లపైకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోమల నిర్మూలనకు బ్లీచింగ్, ఫాగింగ్ సరిగా చేయడం లేదు. దీనికి తోడు నగర ంలో పందుల బెడద ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతా ల్లో చెత్తపై పందులు దొర్లుతున్నాయి. అందుకే అను కోని కొత్త రోగాల బారిన పడుతున్నారని స్థానికుల అభిప్రాయం. నగరంలో తాగునీటిని సరఫరా చేసే పంపుల చెరువు వద్ద నీటిని శుభ్రం చేసే ఫిల్టర్లు నాచు పట్టి అధ్వా నంగా తయారయ్యాయి. నీటి పరీక్ష లు నిర్వహించే లేబోరేటరీలో ఎటువంటి పరికరాలు లేవు. నగరంలో డ్రెయిన్లలో ఎన్నో ఏళ్ల కిందట తాగు నీటి పైపులు వేయడంతో ఇవి తుప్పుబట్టి చాలా సార్లు లీకైన సందర్భాలు ఉన్నాయి. కలుషిత నీరు తాగి గతంలో చాలా మంది తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. అయినప్పటికీ నగరపాలక సిబ్బంది తాత్కాలికంగా బాగు చేయడమే కాని వాటిని డ్రెయిన్ల నుంచి వేరుచేసే ప్రయత్నాలు చేయడం లేదు. నగరంలో పారిశు ధ్యాన్ని మెరుగుపరిస్తే ఇలాంటి వింత జబ్బులు రాకుండా ఉంటాయని పురప్రజల అభిప్రాయం.
పారిశుధ్య మెరుగుదలకు చర్యలు : డి.చంద్రశేఖర్, కమిషనర్
నగరపాలక సిబ్బంది మెరుగైన పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. తాగునీటి కాలుష్యం లేదని వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ ఎక్కడైనా పైపులు లీకేజీలు ఉన్నాయేమోనని సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఎక్కడా లీకైన దాఖలాలు కనిపించడం లేదు. దోమల నిర్మూలనకు బ్లీచింగ్, ఫాగింగ్ చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశాం.
