జీడిగుంటలో ఇసుక దందా

ABN , First Publish Date - 2020-05-11T10:08:28+05:30 IST

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను పూడ్చే మట్టిని తరలించేందుకు అనుమతులు మంజూరు చేస్తే.

జీడిగుంటలో ఇసుక దందా

70 లారీల ఇసుక అక్రమంగా నిల్వ.. ముగ్గురిపై కేసు నమోదు


నిడదవోలు, మే 10: ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను పూడ్చే మట్టిని తరలించేందుకు అనుమతులు మంజూరు చేస్తే.. దీనిని అడ్డం పెట్టుకుని ఓ రాజకీయ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు ఇసుక దందాకు తెరలేపారు. నిడదవోలు మండలం జీడిగుంట పంచాయతీ పరిధిలోని లంకలో మట్టి తవ్వి ఇళ్ల స్థలాలను పూడ్చేందుకు రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు. దీనిని అడ్డం పెట్టు కుని నాయకులు శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జీడిగుంటలంక నుంచి సుమారు 70 లారీలకు పైగా ఇసుకను జీడిగుంటలోని కొత్త రామాలయం చెరువు వద్ద వున్న పంచాయతీ స్థలంలో నిల్వచేశారు.


స్థానికులు ఈ విషయాన్ని రెవె న్యూ అధికార్లకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో సమాచారంతో సీఐ స్వామి మానే వీర్రాజు, మానే దుర్గాప్రసాద్‌, బట్టు రాజులపై కేసు నమోదు చేసి ఒక లారీని, 75 టన్నుల ఇసుక సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఇసుక తరలింపులో ప్రధాన సూత్రధారులను అరెస్టు చేయకపోవడం, మరో మూడు లారీలను, వాటిలో లోడ్‌ చేసిన ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలను, ఇసుకను ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని ఓ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. 

Updated Date - 2020-05-11T10:08:28+05:30 IST