ఆర్టీసీకి తీవ్ర నష్టం

ABN , First Publish Date - 2020-11-04T04:57:39+05:30 IST

హైదరాబాద్‌ బస్సు సర్వీసులు తగ్గించడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి భారీ నష్టం జరుగుతుందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లిం సత్యనారాయణ అన్నారు.

ఆర్టీసీకి తీవ్ర నష్టం

భీమవరం, నవంబరు 3 : హైదరాబాద్‌ బస్సు సర్వీసులు తగ్గించడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి భారీ నష్టం జరుగుతుందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లిం సత్యనారాయణ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యు డు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ భీమవరం డిపో నుంచి, భీమవరం నుంచి హైదరాబాద్‌కు ఆరు సర్వీలు ఉండగా ప్రస్తుతం రెండు సర్వీసు లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో నష్టం వస్తుందన్నారు. ఆర్టీసీ డిపో కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రెసిడెంట్‌ ఆర్‌వి.రాజు, తుంగ మురళీ, చినమిల్లి శ్రీనువాసు, మల్లుల సీతారాం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-04T04:57:39+05:30 IST