వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము

ABN , First Publish Date - 2020-11-03T05:51:47+05:30 IST

ఒక మోస్తరు వర్షం కురిసినా బురద మయం.. కాస్త ఎండొస్తే దుమ్ము భయం.

వానొస్తే బురద.. ఎండొస్తే దుమ్ము
కొయ్యలగూడెం ప్రధాన సెంటర్‌లో వానొస్తే బురదమయమైన రోడ్డు

అనారోగ్యం పాలవుతున్నామన్న స్థానికులు

కొయ్యలగూడెం, నవంబరు 2: ఒక మోస్తరు వర్షం కురిసినా బురద మయం.. కాస్త ఎండొస్తే దుమ్ము భయం. ఇదీ కొయ్యలగూడెం ప్రధాన సెంటర్‌లో నిత్యం కనపడే పరిస్థితి. రోడ్లన్నీ పూర్తిగా పాడై కొద్దిపాటి వర్షానికే నీరు చేరి బురదగా మారుతున్నాయి. ఆ బురదలో వెళ్లడానికి పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండొస్తే బురద ఎండిపోయి వాహనాలు వెళ్లేటప్పుడు రహదారి కనిపించ నంత దట్టంగా దుమ్ము, ధూళి కమ్ముకుని వాహనచోదకులకు రహదారి కనిపించదు. ఆ దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అనారోగ్యానికి గురవుతున్నా మంటూ ప్రజలు వాపోతున్నారు. మొన్నటి వరకు బురదతో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు దుమ్మూ ధూళితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు, షాపు యాజమానులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు బాగుచేయాలని  కోరుతున్నారు. 



Updated Date - 2020-11-03T05:51:47+05:30 IST