రహదారులకు మరమ్మతులు చేపట్టాలి : ఎమ్మెల్యే రామరాజు
ABN , First Publish Date - 2020-08-22T11:35:49+05:30 IST
గణపవరం-కలవపూడి రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే రామరాజు అన్నారు
చినకాపవరం (ఆకివీడు రూరల్) ఆగస్టు 21: గణపవరం-కలవపూడి రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే రామరాజు అన్నారు. మండలంలోని చిన కాపవరం, పెదకాపవరం, గుమ్ములూరు, చెరుకుమిల్లి ప్రాంతాలలలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని డీఈ శ్రీనివాసరావు, ఏఈ వర్మకు చూపించారు. నియోజకవర్గానికి సుమారు రూ.3.42కోట్లు మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరు అయ్యాయని అధికారులు తెలిపారు. జనరల్ ఫండ్స్ నుంచి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.