రహదారుల దుస్థితి పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-06T05:46:40+05:30 IST

రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా మారాయని, వాటి బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్‌ కిశోర్‌ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.

రహదారుల దుస్థితి పట్టని ప్రభుత్వం
కండ్రికగూడెం సెంటర్‌లో బీజేపీ రా స్తారోకో

 బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విక్రమ్‌ కిశోర్‌ ధ్వజం

పెదవేగి, డిసెంబరు 5 : రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా మారాయని, వాటి బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్‌ కిశోర్‌ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం కవ్వగుంటలో పాడైన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్న ఊసే లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌ కట్నేని కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ వర్షాల కారణంగా ధ్వంసమైన రహదారులపై ప్రయాణంతో ప్రజలు నరకాన్ని చూస్తున్నారన్నారు. బీజేపీ పెదవేగి మండల అధ్యక్షుడు కాగిత శ్రీనివాస్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 


 ఏలూరు నగరంలో..

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, డిసెంబరు 5 : నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా తయా రయ్యాయని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఏలూరు పార ్లమెంటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొరళ్ళ సుధాకర కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశా రు. కండ్రికగూడెం సెంటర్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర పిలుపులో భాగంగా రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకరకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నా ఇంతవరకూ ఒక్క రోడ్డు కూడా వేయలేదని, అంతేకాకుండా కనీస మరమ్మతులు చేయలేదన్నా రు. రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు. ఇప్పటికైనా రోడ్లు నిర్మించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శీర్ల భాస్కర్‌, దిడ్ల ఆంజిలో, నుదురుపాటి కృష్ణ చైతన్యశర్మ, ఉలవల సాయి, నాగం శివ, బాడిద నారాయణ, ఆడపాక నాగసురేష్‌ పాల్గొన్నారు. 


దెందులూరు మండలంలో..

దెందులూరు, డిసెంబరు 5 : మండలంలో చాలా గ్రామాల్లో రోడ్లు అధ్వా నంగా ఉన్నాయని వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని దెందులూరు మండల భారతీయ జనతాపార్టీ కార్యదర్శి చికట్లు ప్రభు అన్నారు. పోతునూరు నుంచి దోసపాడు వరకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించేందుకు  శనివారం వారు పాదయాత్ర చేశారు. అనంతరం బీజేపీ నేతలు మూండూరి బుజ్జీగోపా ల్‌, ఏసు, పరస నాగేశ్వరరావు, తదితర నేతలతో కలిసి దెందులూరు ఇన్‌చార్జి ఎంపీడీవో భీమరాజుకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నేతలు పాల్గొన్నారు. 


 పెదపాడు మండలంలో..

పెదపాడు, డిసెంబరు 5: రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయని, ప్రభు త్వం వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పెద పాడులో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గోతులమయమైన రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:46:40+05:30 IST