-
-
Home » Andhra Pradesh » West Godavari » roads
-
చినుకు పడితే చెరువే..
ABN , First Publish Date - 2020-11-28T05:27:33+05:30 IST
చినుకు రాలితే ఏలూరు నగరం చెరువులా మారి పోతోంది.

వర్షాలకు నగరంలో రోడ్లు ధ్వంసం
వాహనదారుల పాట్లు
ఏలూరు/ఏలూరు రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చినుకు రాలితే ఏలూరు నగరం చెరువులా మారి పోతోంది. కార్పొరేషన్‌లోని ప్రధాన కూడళ్లు సహా, నగర శివారు ప్రాంతాలన్నీ నీటిమయమవుతున్నాయి. రహదారులపై గుంతలు ఉండడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. వాహనాలు వెళ్లేం దుకు వీలు లేనంతగా రహదారులు దెబ్బతిన్నాయి. గురువారం నుంచి కురు స్తున్న వర్షాలకు నగరంలోని వసంత మహల్ సెంటర్, హాయ్ హోటల్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ హైస్కూల్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ వద్ద నున్న బడేటి చౌక్‌లలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలోనే రోడ్లు ఇలా ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర శివా ర్లలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని గణేశ్ కాలనీ, చాటపర్రు రోడ్లు అధ్వానంగా మారాయి. మాదేపల్లి, జాలిపూడి, కొత్తూరు, ఇందిరమ్మ కాలనీలో రోడ్లు బురద కయ్యలుగా మారాయి.
