జాతీయ రహదారికి మరమ్మతులు

ABN , First Publish Date - 2020-12-14T04:26:21+05:30 IST

జాతీయ రహదారికి మోక్షం వచ్చింది. రహదారిపై పడిన గోతులతో ఇప్పటి వరుకూ వాహనదారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎప్పుడెప్పుడు రహదారులకు మరమ్మతులు చేస్తారా అని ఎదురుచూసిన వాహన దారుల కల ఫలించింది. ప్రస్తుతం రహదారి మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.

జాతీయ రహదారికి మరమ్మతులు
మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

పెంటపాడు, డిసెంబరు 13 : జాతీయ రహదారికి మోక్షం వచ్చింది. రహదారిపై పడిన గోతులతో ఇప్పటి వరుకూ వాహనదారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎప్పుడెప్పుడు రహదారులకు మరమ్మతులు చేస్తారా అని ఎదురుచూసిన వాహన దారుల కల ఫలించింది. ప్రస్తుతం రహదారి మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన కాంట్రాక్ట్‌ కంపెనీ సేఫ్‌వేకన్‌షెషన్స్‌ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అలంపురం జంక్షన్‌ నుంచి గుండుగొలను జంక్షన్‌ వరుకూ 42 కిలోమీటర్లు సబ్‌ కాంట్రాక్ట్‌ పనులను టీబీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేజిక్కించుకుందని చైర్మన్‌ తనుబుద్ధి బోగేశ్వరరావు తెలిపారు. 4 టీంలు పనులు నిర్వహిస్తున్నాయని.. ఈ నెలాఖరుకు పనులు పూర్తవుతాయన్నారు.  


Updated Date - 2020-12-14T04:26:21+05:30 IST