సబ్సిడీపై వరి విత్తనాలు

ABN , First Publish Date - 2020-07-20T11:51:40+05:30 IST

మండలంలో నారుమడులకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి గంగాధర్‌ తెలిపారు. వరి విత్తనాలు కావాల్సిన రైతులు తమ గ్రామ రైతు

సబ్సిడీపై వరి విత్తనాలు

అత్తిలి, జూలై 19: మండలంలో నారుమడులకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి గంగాధర్‌ తెలిపారు. వరి విత్తనాలు కావాల్సిన రైతులు తమ గ్రామ రైతు భరోసా కేంద్రాలు వద్దకు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధార్‌ కార్డు, జిరాక్సు తీసుకుని నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఎంటీయూ (స్వర్ణ) 7029, ఎంటీయూ 1153 (చంద్ర),ఎంటీయు 1161 (ఇంద్ర), ఎంటీయు 1121 (త్రిదూత్‌) అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2020-07-20T11:51:40+05:30 IST