20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-01T05:27:38+05:30 IST

అక్రమంగా 20 టన్నుల రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ తెలిపారు.

20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

టి.నరసాపురం, అక్టోబరు 31 : అక్రమంగా 20 టన్నుల రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు శనివారం టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలెం వద్ద దాడి చేసి బియ్యాన్ని, లారీని స్వాధీన పర్చుకున్నట్టు హెచ్‌సీ తెలిపారు. 


Read more