నిధులున్నా.. స్థలమేది?

ABN , First Publish Date - 2020-06-19T10:21:54+05:30 IST

మండలంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉండ టంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగా

నిధులున్నా.. స్థలమేది?

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి స్థలం చూపని రెవెన్యూ..

లో వోల్టేజీ, అంతరాయాలతో తిమ్మాపురం వాసుల వెతలు


ద్వారకాతిరుమల, జూన్‌ 18: మండలంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉండ టంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగా తిమ్మాపురంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి నిధులు కేటాయింపు జరిగింది. అయితే స్థలం కేటాయించకపోవడంతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం జరగడం లేదు. దీనిపై ఎలక్ట్రి కల్‌ ఏఈ ఎస్‌ఎస్‌ దీక్షితులను వివరణ కోరగా తిమ్మాపురంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణా నికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటా యిస్తే వెంటనే పనులు  ప్రారంభిస్తామని తెలిపారు.


ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణం వల్ల గ్రామంలో 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరాతో పాటు లో-ఓల్టేజీ సమస్య లేకుం డా ఉంటుందన్నారు. ద్వారకాతిరుమల, తిరుమలంపాలెం సబ్‌స్టేషన్‌లపై లోడ్‌ ఎక్కువగా ఉండడంతో తిమ్మాపురంలో సబ్‌స్టేషన్‌ నిర్మిస్తే తిమ్మాపురంతో పాటు తిరుమలంపాలెం, కొమ్మర, రాళ్లకుంట, దొరసానిపాడు, పావులూరివారి గూడెం, నారాయణపురం తదితర గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తిమ్మాపురంలో సబ్‌స్టేషన్‌ నిర్మించి  తగిన చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామ స్థులు కోరుతున్నారు.

Updated Date - 2020-06-19T10:21:54+05:30 IST