-
-
Home » Andhra Pradesh » West Godavari » Registrations are down
-
రిజిస్ట్రేషన్‌లు డౌన్
ABN , First Publish Date - 2020-04-07T11:13:20+05:30 IST
కరోనా రిజిస్ర్టేషన్ శాఖపై తీవ్ర ప్రభావన్నే చూపుతోంది. కార్యాలయాలు తెరచి ఉంటునప్పటికీ కక్షిదారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు.

75 శాతానికి పడి పోయిన లక్ష్యం
ఇప్పటికే 80 కోట్లు ఆదాయం
తగ్గిందని అంచనా
(తాడేపల్లిగూడెం-ఆంధ్ర జ్యోతి)
కరోనా రిజిస్ర్టేషన్ శాఖపై తీవ్ర ప్రభావన్నే చూపుతోంది. కార్యాలయాలు తెరచి ఉంటునప్పటికీ కక్షిదారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. అగ్రిమెంట్‌లను వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా ఏలూరు, భీమవరం పరిధిలో గడచిన రెండు వారాలుగా ఒక్క రిజిస్ర్టేషన్ కూడా జరగలేదు. దాదాపు రూ. 80 కోట్లు ఆదాయం తగ్గిందని అంచనా. మార్చి నెలలో రిజిస్ర్టేషన్‌లు అత్యధికంగా జరుగుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏలూరు, భీమవరం రిజిస్ర్టేషన్ పరిధిలో గడచిన ఆర్థిక సంవత్స రంలో రూ.650 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు.
అందులో 75 శాతం మాత్రమే చేరుకోగలిగారు.లాక్‌డౌన్ లేకపోతే మార్చి మాసాంతంలోనే పశ్చిమలో రెండు రిజిస్ర్టేషన్‌ల పరిధిలో రూ.80 కోట్ల మేర ఆదాయం సమకూరేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పట్లో రిజిస్ర్టేషన్ శాఖ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ తర్వాతే రిజిస్ర్టేషన్లు జోరందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అగ్రిమెంట్‌లు మాత్రమే వాయిదా పడ్డాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన నష్టాలు త్వరలోనే భర్తీ అవుతాయని, ఫలితంగా ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదని రిజిస్ర్టేషన్ శాఖ డీఐజీ తెలిపారు.