ఆకతాయిలపై కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-04-26T11:32:40+05:30 IST
ఆకతాయిలు మోటారు సైకిళ్లపై రోడ్డు పైకి వస్తున్నారని అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు రేంజ్ ..

ఆకతాయిలపై కేసులు నమోదు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 25 : ఆకతాయిలు మోటారు సైకిళ్లపై రోడ్డు పైకి వస్తున్నారని అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. ఏలూరు నగరంలోని పలు ప్రాంతాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ప్రాంతాల్లోని పోలీస్ పికెట్లను తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు. ఈ సంద ర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటలోపు నిత్యావసర సరుకులు, ఇతర పనులను ముగించు కోవాలని సూచించారు. ఆ తర్వాత సరైన కారణం లేకుండా ఎవరైనా బయటికి వస్తే కేసులు నమోదు చేయా లని ఆదేశించారు. ఏలూరు రేంజ్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై 5,734 ఐపీసీ కేసులు నమోదు చేసి 13,372 మందిని అరెస్ట్ చేశామన్నారు. 3,181 దుకాణాలపై కేసు లు నమోదు చేసి 1,16,784 వాహనాలపై మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి రూ.6,66,51,517లు అపరాధ రుసుం విధించినట్టు చెప్పారు. 4,445 వాహనాలను సీజ్ చేశా మని వెల్లడించారు. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులను గరికపాడు, చింతలపూడి, జీలుగుమిల్లి వద్ద ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. ఏలూరు త్రీటౌన్ సీఐ ఎంఆర్‌ఎల్ మూర్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.