రైతులను అప్రమత్తం చేయాలి : ఆర్డీవో లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-12-10T06:28:10+05:30 IST

పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతున్న దృష్ట్యా సాగు నీటి అవసరాలపై రైతులను అప్రమత్తం చేయాలని ఆర్డీవో వి.లక్ష్మారెడ్డి సూచించారు.

రైతులను అప్రమత్తం చేయాలి : ఆర్డీవో లక్ష్మారెడ్డి

తణుకు, డిసెంబరు 9 : పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతున్న దృష్ట్యా సాగు నీటి అవసరాలపై రైతులను అప్రమత్తం చేయాలని ఆర్డీవో వి.లక్ష్మారెడ్డి సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం తణుకు నియోజకవర్గస్థాయి ఇరిగేషన్‌ సలహా మండలితో సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయన్నారు. రైతులందరూ ముందస్తు సాగు చేసుకునేలా అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌, ఇరగవరం తహసీల్దార్‌ రాజరాజేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, ఎలక్ర్టికల్‌, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T06:28:10+05:30 IST