మాల మహానాడు లీగల్ కన్వీనర్‌గా రత్నదీప్
ABN , First Publish Date - 2020-12-14T04:28:26+05:30 IST
మాలమహానాడు లీగల్ కన్వీ నర్‌గా పిఎస్ రత్నదీప్ నియమితులయ్యారు.

తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 13 : మాలమహానాడు లీగల్ కన్వీ నర్‌గా పిఎస్ రత్నదీప్ నియమితులయ్యారు. తాడేపల్లిగూడెంలోని రత్నదీప్ నివాసంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేశ్ నియామకపత్రం అందిం చారు.అనంతరం నల్లి రాజేష్ మాట్లాడుతూ రొయ్యల చెరువుల నుంచి పంట కాలువల్లో కలుస్తున్న కలుషిత నీటి కారణంగానే ప్రజలు అనారోగ్యం పాలవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు, జిల్లా కార్యదర్శులు గారపాటి నానాజీ, నల్లి సంజీవరావు, డివిజన్ ఉపాధ్యక్షుడు బద్దా అంతర్వేది, మట్టా చంద్రశేఖర్ పాల్గొన్నారు.