చౌక డిపోల ద్వారానే రేషన్
ABN , First Publish Date - 2020-03-02T11:25:38+05:30 IST
జిల్లాలో రేషన్ కార్డులన్నింటికీ ఈనెల రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా బియ్యం కార్డుల పంపిణీ పూర్తి కాలేదు. దీంతో జిల్లాలోని 12.60 లక్షల మంది

ఈ నెల అన్ని కార్డులకు సరుకులు పంపిణీ
రేషన్ కార్డుల పునఃపరిశీలన పూర్తి.. విడుదల కాని జాబితా
ఏలూరు సిటీ, మార్చి 1 : జిల్లాలో రేషన్ కార్డులన్నింటికీ ఈనెల రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా బియ్యం కార్డుల పంపిణీ పూర్తి కాలేదు. దీంతో జిల్లాలోని 12.60 లక్షల మంది కార్డుదారులకు జిల్లాలోని 2220 రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. బయో మెట్రిక్ విధానం (పాత విధానం ) ద్వారానే రేషన్ సరుకులను కార్డు దారులకు చౌకడిపోల వారు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఇంటింటికీ వలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు సరఫరా చేయనున్నట్టు తెలు స్తోంది. ఈ మేరకు ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కాలేదు. నవశకం సర్వేలో అనర్హులుగా గుర్తిం చిన కార్డుదారుల కుటుంబ సమాచారాన్ని పునః పరి శీలన పూర్తయింది. కాని ఇంతవరకు రెండో విడతలో ఎంతమంది అర్హులు ఉన్నారో జాబితా విడుదల కాలేదు. జిల్లాలో మొత్తం అర్హుల జాబితా ఇంకా తేలలేదు.
జిల్లాలో నవశకం సర్వేలో 12.53 లక్షల కార్డుదారుల కుటుంబ సమాచారాన్ని వలంటీర్లు సేకరించారు. ఇందులో 11.40 లక్షల మంది కార్డుదారులను అర్హులుగా తేల్చారు. మిగిలిన లక్షా 13,500 కార్డుదారులకు సంబంఽ ధించి కుటుంబ సమాచారాన్ని పునఃపరిశీలన చేశారు. అయితే అర్హుల జాబితా విడుదల కాలేదు. జిల్లాలో బియ్యం కార్డుల పంపిణీ కొనసాగుతోంది. నవశకం సర్వేలో తొలి విడతలో అర్హులుగా గుర్తించిన 11.40 లక్షల కార్డుల ప్రింటింగ్ జరుగుతోంది. ప్రింటింగ్‌లో జాప్యం జరుగుతుండడంతో కార్డుల పంపిణీలో జాప్యం జరగు తోందని అధికారులు చెబుతున్నారు. తొలివిడత అర్హుల జాబితాలో వచ్చిన కారు ్డదారులకు 50 శాతం మాత్రమే బియ్యం కార్డులు పంపిణీ జరగడంతో మిగిలిన కార్డులు ఎప్పటికి పంపిణీ అవుతాయో అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆరు లక్షల బియ్యం కార్డుల పంపిణీ
ఎన్.సుబ్బరాజు, డీఎస్‌వో
అర్హులైన అందరికీ బియ్యం కార్డులు పంపిణీ చేస్తున్నాం. తొలి విడతలో నవశకంలో వచ్చిన అర్హుల జాబితాలో ఆరు లక్షల మందికి బియ్యం కార్డులు పంపిణీ చేశాం. ప్రింటింగ్ చేసిన కార్డులను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నాం. రెండో విడతలో పునఃపరిశీలన కార్యక్రమంలో అర్హులైన వారికి కూడా బియ్యం కార్డులు పంపిణీ చేస్తాం. ఈనెల జిల్లాలో గతంలో ఉన్న కార్డు దారులందరికీ రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నాం.