రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-02T05:05:36+05:30 IST
విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం దెందులూరు పెట్రోలు బంకు వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని నిలుపుదల చేశారు.
దెందులూరు, డిసెంబరు 1: గుంటూరు జిల్లా యడ్ల పాడు మండలం కొత్తసోలస గ్రామం నుంచి కాకినాడకు రేషన్ బియ్యం తరలిస్తున్నా రనే విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం దెందులూరు పెట్రోలు బంకు వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని నిలుపుదల చేశారు. ఇందులో తరలిస్తున్న సుమారు 28 టన్నుల రేషన్ బియ్యంను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.