-
-
Home » Andhra Pradesh » West Godavari » RandR Lands
-
ఆర్‌అండ్‌ఆర్ భూముల్లో సాగు చేస్తే క్రిమినల్ కేసులు
ABN , First Publish Date - 2020-11-26T05:11:59+05:30 IST
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో పంటల సాగు చేస్తే క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలని ఆర్‌అండ్‌ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆనంద్ అధికారు లను ఆదేశించారు.

జంగారెడ్డిగూడెం, నవంబరు 25 : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో పంటల సాగు చేస్తే క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలని ఆర్‌అండ్‌ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆనంద్ అధికారు లను ఆదేశించారు. చల్లావారిగూడెంలో నిర్మాణంలో వున్న పునరావాస గృహాల ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ, రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్థానికులు ఆయన దృష్టికి తీసు కువెళ్లారు. భూములకు పరిహారం పొందిన సుమారు 100 ఎకరాల్లో పామాయి ల్ తోటల నుంచి ఫలసాయాన్ని పొందుతూ అక్రమార్జనకు పాల్పడు తున్నారని తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆ భూములను ఆర్డీవోకు అప్పగించాలని ఐటీడీఏ పీవోను ఆదేశించారు. ఐటీడీఏ పీవో సూర్యనారాయణ, జంగారెడ్డిగూ డెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.