పారిశుధ్యం మెరుగుపరచాలి

ABN , First Publish Date - 2020-07-14T11:37:42+05:30 IST

పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు చేయడం లేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

పారిశుధ్యం మెరుగుపరచాలి

ఎమ్మెల్యే రామానాయుడు


పాలకొల్లు అర్బన్‌, జూలై 13: పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు చేయడం లేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలోని 22వ వార్డు రెడ్‌జోన్‌ ప్రాంతం, ప్రభుత్వ మద్యం దుకాణాల ప్రాంతాల్లో ఎమ్మెల్యే రామానాయుడు సోమవారం పర్యటించారు. లాక్‌ డౌన్‌లో నిత్యావసరాలకు కూడా అనుమతించడం లేదని, మద్యం దుకా ణాలు అనుమతించడం ఏమిటని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అన్న ప్రభుత్వం నేడు కరోనా విపత్తులో కూడా మద్యాన్ని నిత్యావసర వస్తువుగా పరిగణించడం దారుణమన్నారు. ఈసందర్భంగా పూర్తిస్థాయిలో శానిటేషన్‌ పనులు చేపట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

Updated Date - 2020-07-14T11:37:42+05:30 IST