-
-
Home » Andhra Pradesh » West Godavari » Ramam Vardhanthi
-
రామం ఆశయాలు నేటి యువతకు ఆదర్శం
ABN , First Publish Date - 2020-11-28T05:10:21+05:30 IST
కమ్యూనిస్టు ఉద్యమ నేత ఉద్దరాజు రామం ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్, రాజారామ్మోహన్‌రాయ్ అన్నారు.

భీమవరం, నవంబరు 27 : కమ్యూనిస్టు ఉద్యమ నేత ఉద్దరాజు రామం ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్, రాజారామ్మోహన్‌రాయ్ అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం రామం వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాలో ఏర్పడిన సీపీఎం తొలి శాఖకు ఆయనే కార్యదర్శి అని, జిల్లాలో రైతాంగం ఉద్యమంలో ఆయన ముఖ్య పాత్ర వహించారన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.