రైతులకు నష్టపరిహారం అందించాలి

ABN , First Publish Date - 2020-11-04T04:45:34+05:30 IST

అకాల వర్షాలు వలన పంట నీట మునిగి పాడైన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు.

రైతులకు నష్టపరిహారం అందించాలి
కాళ్ళ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న జనసేన, బీజేపీ నాయకులు

కాళ్ళ, నవంబరు 3 : అకాల వర్షాలు వలన పంట నీట మునిగి పాడైన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌, వ్యవసాయశాఖ అధికారులకు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. మురుగు నీరు పారుదల వ్యవస్థను ప్రక్షాళన చేయకపోవడంతో ముంపు తలెత్తిందన్నారు. పంట కాలువలకు ఆనుకుని చేపలు, ఆక్వా చెరువులు తవ్వడంతో కాలువలు ఉప్పునీటి కయ్యలుగా మారాయన్నారు. ఈ నీరు చేలకు వెళ్లడంతో పంట కుళ్లి పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. అధికారులు పారదర్శకంగా పంట నష్టం అంచనా వేసి నివేదిక తయారు చేసి రైతుకు త్వరగా నష్టపరిహారాన్ని అందేలా చూడాలని కోరారు. ఆరేటి దిలీప్‌, తెలగంశెట్టి సతీష్‌, బండారు గణేష్‌, సుంకర సురేష్‌, గనిశెట్టి ప్రసాద్‌, తదితర జనసేన, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-04T04:45:34+05:30 IST