-
-
Home » Andhra Pradesh » West Godavari » Railway employee killed in train collision
-
రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2020-03-13T11:21:24+05:30 IST
విధి నిర్వహణలో ఉన్న రైల్వే ఉద్యోగి పట్టాలు దాటుతుందడగా గూడ్స్ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏలూరుకు చెందిన

ఏలూరు క్రైం, మార్చి 12 : విధి నిర్వహణలో ఉన్న రైల్వే ఉద్యోగి పట్టాలు దాటుతుందడగా గూడ్స్ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏలూరుకు చెందిన నాగిళ్ళ శ్యామ్‌ప్రసాద్‌బాబు (57) రైల్వే గ్యాంగ్ మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం పెద్దరైల్వేస్టేషన్ వద్ద విధుల్లో భాగంగా పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ వి.చంద్రశే ఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదే హాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.