ఏలూరు డిమార్ట్‌ వద్ద క్యూ

ABN , First Publish Date - 2020-03-24T11:24:54+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు..వదంతులను నమ్మవద్దు.. ఖచ్చి

ఏలూరు డిమార్ట్‌ వద్ద క్యూ

జిల్లాలో ఒక్క కేసూ లేదు 

వదంతులను నమ్మొద్దు 

 రాఘవాపురం, చింతలపూడిలో ప్రత్యేక పరీక్షలు 

 ప్రత్యేక క్వారంటైన్‌లో 30 మంది 

 ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వారిని పరీక్షించాం 

 జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు


ఏలూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు..వదంతులను నమ్మవద్దు.. ఖచ్చి తమైన సమాచారం లేకుండా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు హెచ్చరించారు. జిల్లాలో కరోనా వైరస్‌ అదుపులో ఉంచేందుకు ప్రతీఒక్కరూ స్వీయరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోరారు. జిల్లాలో 12,43,246 ఇళ్లకు సంబంధించి, 12,16,351 ఇళ్లను కొవిడ్‌ నియంత్రణకు ఏర్పాటు చేసిన బృందాలతో సర్వే పూర్తి చేశామన్నారు.


వీటిలో స్వల్ప అనారోగ్యంతో ఉన్న 3,159 కేసులు గుర్తించగా, వారిలో 1,482 కేసులు 15 నుంచి 28 రోజులవరకు, 783 కేసులు 14 రోజులలోపు గృహనిర్భంధంలో ఉంచడానికి గుర్తించామన్నారు. ఇప్పటి వరకు నాలుగు కరోనా అనుమానిత కేసులను గుర్తించి ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా, నాలుగు కేసులు నెగిటివ్‌గా రిపోర్టులు  అందాయన్నారు. ముందస్తు చర్యలలో బాగంగా 46 ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసు కున్నామన్నారు. 

Updated Date - 2020-03-24T11:24:54+05:30 IST