పట్టణంలో కొండచిలువ

ABN , First Publish Date - 2020-11-01T04:33:05+05:30 IST

ముంపుతో ఇబ్బం ది పడుతున్న ఆకివీడు పట్టణంలో కొండ చిలువ సంచారం మరింత భయ పెడుతోంది. స్థానికి పిల్లావీధిలో 12 అడుగుల కొండచిలువను స్థానికులు శనివారం హతమార్చారు.

పట్టణంలో కొండచిలువ
ఆకివీడులో స్థానికులు హతమార్చిన 12 అడుగుల కొండచిలువ

హతమార్చిన స్థానికులు

ఆకివీడులో భయం భయం

ఆకివీడు, అక్టోబరు 31: ముంపుతో ఇబ్బం ది పడుతున్న ఆకివీడు పట్టణంలో కొండ చిలువ సంచారం మరింత భయ పెడుతోంది. స్థానికి పిల్లావీధిలో 12 అడుగుల కొండచిలువను స్థానికులు శనివారం హతమార్చారు. మురుగు గుంటలో ఉన్న కొండచిలువ రోజూ కోళ్లను మింగుతోంది. శుక్రవారం కోడిని పట్ట డంతో స్థానికులు బెదరగొట్టారు. శనివారం అదే కోడిని తాడుకు కట్టి ఎరగా ఉంచి కొండచిలువను హతమార్చారు. వెంకయ్య వయ్యేరు కాలువ గట్టు దగ్గర పడేశారు. ఇంత పెద్ద కొండచిలువను ప్రజలు, మహిళలు చూసి భయపడుతున్నారు. ముంపుతో ఈ ప్రాంతా నికి కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పట్టపగలు ఇళ్లలోకి వస్తుంటే తమ పరిస్థితి ఏమిటని స్థానికులు భాయందోళన చెందుతున్నారు.

Read more