-
-
Home » Andhra Pradesh » West Godavari » Punaravasam kalpinchandi
-
పునరావాసమైనా కల్పించండి.. పనులైనా చూపండి..
ABN , First Publish Date - 2020-11-22T04:59:14+05:30 IST
పోలవరం నిర్మాణంలో భాగంగా పూర్తస్థా యిలో పునరావాసమైనా కల్పించండి. లేదంటే ఇసుక తెచ్చుకునేందుకు అను మతులిచ్చి పనైనా చూపాలని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు.

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
కుక్కునూరు, నవంబరు 21 : పోలవరం నిర్మాణంలో భాగంగా పూర్తస్థా యిలో పునరావాసమైనా కల్పించండి. లేదంటే ఇసుక తెచ్చుకునేందుకు అను మతులిచ్చి పనైనా చూపాలని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామంలో శనివారం ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ రాజ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. సొంత పనులకు కనీసం ఎడ్లబండ్లపై ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. పనులు లేక పస్తు లుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీడీఏ పీవో, పోలవరం ఎమ్మేల్యే దృష్టికి తీసుకెళ్లగా అనుమతిచ్చారని తెలిపారు. స్ధానిక పోలీసులు ఎడ్లబండిపై ఇసుక తెచ్చుకుంటున్నపటికీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి వై.సాయికిరణ్, షేక్ వలీబాషా, సలీంబాషా, హరినాఽథ్, మహబూబ్‌బాసా, సతీశ్ పాల్గొన్నారు.