సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-11-27T05:09:26+05:30 IST

కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను కాపాడాలని కోరుతూ స్థానిక సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేకపూజలు చేశారు.

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

తాళ్లపూడి, నవంబరు 26 : కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను కాపాడాలని కోరుతూ స్థానిక సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేకపూజలు చేశారు. గోదావరి నదీ జలాలతో అభిషేకం అనంతరం అర్చకులు చేబోలు సుబ్రహ్మణ్యశర్మ పంచామృతాలతో అభిషేకాలు చేశారు. 150 లీటర్ల పాలతో భక్తులు క్షీరాభిషేకం చేశారు.  కమిటీ అధ్యక్షుడు సింహాద్రి జనార్దనరావు, ఎం. శ్రీనివాస్‌, కొండూరి రాముడు, అల్లూరి ఉమాప్రకాశ్‌,  మేరేటి శేషు పాల్గొన్నారు

Updated Date - 2020-11-27T05:09:26+05:30 IST