-
-
Home » Andhra Pradesh » West Godavari » ps gopalakrishna dwivedi video conference with jc west godavari dist
-
ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రానివ్వం
ABN , First Publish Date - 2020-12-29T05:08:27+05:30 IST
జిల్లాలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ వెంకట రమణా రెడ్డి తెలిపారు.

జేసీ వెంకటరమణారెడ్డి
ఏలూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ వెంకట రమణా రెడ్డి తెలిపారు. అమరావతి నుంచి సోమవారం సాయంత్రం ఇసుక పాలసీపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ దివేది జాయిట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అంగ న్‌వాడీ నాడు–నేడు పనులతో పాటు పేదల గృహ నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన ఇసుకను సిద్ధం చేసుకోవాలని ద్వివేది జేసీలకు సూచించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సేకరిస్తున్నామని బుకింగ్‌లు ఎక్కువగా ఉంటున్నందున మరో ఐదు రీచ్‌లు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. రోజుకు 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సేకరించగలిగితే ఇసుక ఇబ్బందులు ఉండవని తెలిపారు. మొదటి దశలో జిల్లాలో 1.20 లక్షల గృహాలు మంజూరయ్యాయని వాటికి 34 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా వేశామన్నారు. జిల్లాలో 28 ఓపెన్ రీచ్‌లు ఉన్నాయని మరో 15 రీచ్‌లు తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.