ఇంధన ధరలు తగ్గించాలని నిరసన

ABN , First Publish Date - 2020-06-19T10:28:15+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్య పాలన పోయి వ్యాపార పాలన వచ్చినట్టుగా ఉందని ఏలూరు పార్లమెంట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు అన్నారు.పెంచిన ఇంధన

ఇంధన ధరలు తగ్గించాలని నిరసన

జంగారెడ్డిగూడెం/ఏలూరుకార్పొరేషన్‌/ఆచంట/నిడదవోలు/ఉండ్రాజ వరం, జూన్‌ 18 : దేశంలో ప్రజాస్వామ్య పాలన పోయి వ్యాపార పాలన వచ్చినట్టుగా ఉందని ఏలూరు పార్లమెంట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు అన్నారు.పెంచిన ఇంధన ధరలకు నిరసనగా నల్లమా స్కులు ధరించి గురువారం జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో  నిరసన  చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నాయకులు రాజనాల రామ్మోహనరావు, కమ్ముల కృష్ణ డిమాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.


ఇంధన ధరలు రోజురోజుకు పెంచడం అన్యాయమని ఆచంట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి నెక్కంటి సతీష్‌ అన్నారు.ఇంధన ధరలపెంపు దారుణమని సీపీఎం మండల కార్యదర్శి కామన మునిస్వామి అన్నారు.  ఉండ్రాజవరం గాంధీ బొమ్మ సెంటర్‌లో గురువారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి పెంచుతున్న పెట్రోల్‌ ధరలను తగ్గించాలని నిడదవోలు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కారింకి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కరోనా కష్టాల్లో ఉండగా ఇంధన ధరలు పెంపు తగదని గణపవరం మండలం పిప్పరలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌ రాజు అన్నారు.


కార్యక్రమంలో నాయకులు దండుబోయిన చంద్రశేఖర్‌, సిహెచ్‌ నాగేశ్వరరావు, కాటూరి దుర్గా ప్రసాద్‌, శైలజ, విశ్వనాథం, ఎస్వీ సుబ్బారావు, తాళ్ళూరి చక్రవర్తి, తూరుగోపు వెంకటేశ్వరరావు, బొక్కా రామారావు, రాయుడు సువర్ణరాజు, చిన్నం మురళీకృష్ణ, ఉషారాణి, శారద పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-19T10:28:15+05:30 IST