‘పన్నుభారం పెంచితే ఉద్యమిస్తాం’

ABN , First Publish Date - 2020-12-30T04:27:18+05:30 IST

పన్నులు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని జిల్లా పౌర సమైక్య నాయకులు జేఎన్‌వీ.గోపాలన్‌ హెచ్చరించారు.

‘పన్నుభారం పెంచితే ఉద్యమిస్తాం’
నరసాపురంలో మాట్లాడుతున్న గోపాలన్‌

నరసాపురం టౌన్‌, డిసెంబరు 29: పన్నులు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని జిల్లా పౌర సమైక్య నాయకులు జేఎన్‌వీ.గోపాలన్‌ హెచ్చరించారు. ఇంటి పన్ను పంపు నిర్ణయంపై పట్టణంలోని మండా సత్యనారాయణ కల్యాణ మండపంలో సదస్సు మంగళవారం నిర్వహించారు. గోపాలన్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం పన్నుల భారం పెంచడం సరి కాదన్నారు. సదస్సులో పాల్గొన్న టీడీపీ, జనసేన, వీవర్స్‌ ఫెడరేషన్‌, కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులు పన్నుల భారానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. చెన్నా రమేష్‌, చిటికెల రామ్మోహన్‌, కనకం ప్రసాద్‌, పి.పూర్ణ, కవురు పెద్ది రాజు, నెక్కంటి క్రాంతికుమార్‌, దివిసత్యన్‌, జి.ఆనంద్‌ పాల్గొన్నారు.


పాలకొల్లు అర్బన్‌ : ఆస్తిపన్ను పెంపుదల నిర్ణయాన్ని ఉప సంహరిం చుకోవాలని పట్టణ ప్రజ సంక్షేమ సంఘం కార్యదర్శి వై.అజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. వీవర్స్‌ కాలనీలోని వార్డు సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకపక్క పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్న ప్రభుత్వాలు, ఆస్తిపన్ను పెంచడం దారుణమని అజయ్‌ కుమార్‌ అన్నారు. పన్నులు పెంచుతూ తెచ్చిన జీవో లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవో కాపీలను దగ్ధం చేసి కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. జవ్వాది శ్రీనివాసరావు, వలవల శ్రీరా మమూర్తి, అరట్లకట్ల నారాయణమ్మ, టి.సూర్యనారాయణ, గుబ్బల త్రిమూ ర్తులు, సత్య నారాయణ, తాళాబత్తుల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


భీమవరం అర్బన్‌: ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే విధానం రద్దు చేయాలని, మంచినీరు, డ్రెయినేజీ, చెత్తపై పన్నులు వేయడం మానుకోవాలని పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనరు ఎం.వైకుంఠరావు డిమాండ్‌ చేశారు. 12వ వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి వార్డు కార్యదర్శికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో చెల్లబోయిన వెంకటేశ్వరరావు, తాతాజీ, చెన్ను రామారావు, మేడి శెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:27:18+05:30 IST