ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు అవార్డులు
ABN , First Publish Date - 2020-12-10T06:20:11+05:30 IST
వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌లకు చెన్నైకు చెందిన బి.వసంత్ రాజ్ డేవిడ్ ఫౌండేషన్ అవార్డులను ప్రదానం చేసింది.

తాడేపల్లిగూడెం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌లకు చెన్నైకు చెందిన బి.వసంత్ రాజ్ డేవిడ్ ఫౌండేషన్ అవార్డులను ప్రదానం చేసింది. సీనియర్ శాస్త్రవేత్త, అధ్యాపకురాలు డాక్టర్ ఎ.సుజాతకు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆమె గత 25 ఏళ్లుగా ఉద్యాన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా గడిచిన 13 ఏళ్లుగా ఉద్యాన రంగంలో పరిశోధనలు నిర్వహిస్తున్న డాక్టర్ ఇమ్మూనియాల్‌కు విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. చెన్నైలో ఈనెల 5న నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్‌లో అవార్డులు ప్రదానం చేశారు. వీరిని ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ డాక్టర్ టి.జానకీరామ్ అభినందించారు.