జ్వరమొచ్చినా విధులకు.. ఓ ప్రైవేటు బ్యాంక్‌ మేనేజర్‌ నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2020-07-19T02:22:57+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఆయన మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తనకు తెలిసిన దంపతులకు జ్వరం సోకితే పరామర్శకు వె రు. అప్పటికే వారు పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.

జ్వరమొచ్చినా విధులకు.. ఓ ప్రైవేటు బ్యాంక్‌ మేనేజర్‌ నిర్వాకమిదీ..!

పలువురికి తప్పని ఇబ్బందులు

విద్యావంతులూ ఇలా చేస్తే ఎలా?

కరోనా లక్షణాలు కనిపిస్తున్నా కొందరిలో నిర్లక్ష్యం


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఆయన మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తనకు తెలిసిన దంపతులకు జ్వరం సోకితే పరామర్శకు వె రు. అప్పటికే వారు పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వారిని పరామర్శించి వచ్చిన తర్వాత బ్యాంక్‌ మేనేజర్‌ జ్వరం బారినపడ్డారు. అయినా రోజూ విధులకు వచ్చేవారు. ఈ క్రమంలో బ్యాంకులోని డిప్యూటీ మేనేజర్‌తోపాటు ఆయన భార్యకు జ్వరం సోకింది. కొద్ది రోజులకు బ్యాంక్‌ మేనేజర్‌ పరామర్శించిన దంపతుల్లో  భర్త మరణించారు. దీంతో డిప్యూటీ మేనేజ ర్‌కు అనుమానం వచ్చింది. పరామర్శించేందుకు వెళ్లిన మేనేజర్‌ను ప్రశ్నిస్తే తనకు జ్వరం వస్తోందని చెప్పారు. దీంతో డిప్యూటీ మేనేజర్‌ అవాక్కయ్యాడు. అసలే కరోనా విజృంభిస్తున్న రోజులివి. బ్యాంక్‌ మేనేజర్‌ను కలవడం వల్ల తనతోపాటు, తన భార్యకు జ్వరం వచ్చింది. ఇక బ్యాంకుకు వెళ్లకూడదని డిప్యూటీ మేనేజర్‌ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని మేనేజర్‌ కు చెపితే తాళాలు తమ వద్దే ఉన్నాయి కాబట్టి బ్యాంకు తెరవాల్సిందేనని సూచించారు. తన ద్వారా ఇంకెందరికి జ్వరం వస్తుందోనని ఆయన భయపడుతూనే విధులకు హాజరయ్యారు. 


ఒక రోజు డిప్యూటీ మేనేజర్‌ భార్యకు ఆయాసం ఎక్కువైంది. కరోనా లక్షణాలుగా ఉన్నాయని భావించి ఆశ్రం ఆసుపత్రిలో చేర్పించి ఆక్సిజన్‌ ను ఆమర్చి చికిత్స అందించారు. నాలుగు గంట ల తర్వాత ఆమె కోలుకున్నారు. ఇంటి వద్ద ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు డిప్యూ టీ మేనేజర్‌ దంపతులకు కరోనా పరీక్షలు నిర్వ హించారు. మేనేజర్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో వస్తాయి. ఫలితాలు ఎలా ఉన్నా జ్వరంతో విధులకు హాజరైన బ్యాంక్‌ మేనేజర్‌ కారణంగా ఇంకెంత మంది అనారోగ్యం బారిన పడతారో నన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. 


ఇలా జిల్లాలో ఎందరో జ్వరం బారిన పడినా సొంత వైద్యానికి ప్రాఽధాన్యం ఇస్తున్నారు. జ్వరం వచ్చినట్టు బయటకు చెప్పడం లేదు. కరోనా కేసులు అధికం కావడానికి ఇటువంటి వారు కారణమవుతున్నారు. కరోనా వైరస్‌పై అవగాహ న కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. పెంట పాడు మండలంలోనూ ఇదే మాదిరిగా ఓ వ్యక్తి 15 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్నాడు. ఎప్పటికీ జ్వరం తగ్గలేదు. దీంతో స్థానిక ఏఎన్‌ ఎంను ఆశ్రయించి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలు చేసుకోనిదే జాయి న్‌ చేసుకోమని స్పష్టం చేశారు. అక్కడ పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. కొవ్వూరులో పరీక్షలు చేయించుకుంటే కరోనా లక్షణాలు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించా రు. తాడేపల్లిగూడెం కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుంది. ఇప్పుడతనితో 60 మంది కాంటాక్ట్‌ అయినట్టు గుర్తించారు. వారందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇలా విద్యావంతు లే జ్వరం వస్తే పట్టించుకోకుండా ఏదో మందు ల షాపులోనో, తమకు తెలిసినవో మాత్రలు వేసుకోవడంతో పరిస్థితి విషమిస్తోంది.

Updated Date - 2020-07-19T02:22:57+05:30 IST